ఆ స్టార్ హీరో అవకాశమిస్తే దేనినైనా వదులుకుంటా.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి ప్రియమణి ( Priyamani ) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రియమణి గతంలో పలువురు హీరోలతో కలిసి సినిమాలు చేశారు.ఇక పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చినటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఈమె కెరియర్ పట్ల బిజీ అయ్యారు.
"""/" /
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె కేవలం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలను అందుకుంటున్నారు.
ఇక ఇటీవల మైదాన్ ( Maidaan ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. """/" /
ఈ ఇంటర్వ్యూలలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది.
మీకు షారుఖ్ ఖాన్ ( Sharukh Khan ) తో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ప్రియమణి సమాధానం చెబుతూ ఒకవేళ షారుఖ్ ఖాన్ కనుక తనికి ఫోన్ చేసి మనం కలిసి సినిమా చేయాలి అని చెబితే కనుక తాను ఏమాత్రం ఆలోచించకుండా దేనినైనా వదిలేసి షారుక్ ఖాన్ తో సినిమా చేయడం కోసం వెళ్తాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే షారుక్ ఖాన్ ఇటీవల నటించిన జవాన్ ( Jawan ) సినిమాలో కూడా ప్రియమైన నటించారు.
కానీ పూర్తి స్థాయిలో హీరోయిన్గా మాత్రం షారుఖ్ ఖాన్ తో కలిసిన నటించలేదు.
దీంతో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఓషన్ గేట్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం .. వెలుగులోకి టైటాన్ చివరి క్షణాలు