అలాంటి లుక్ లో దర్శనమిచ్చిన ప్రియదర్శి.. వైరల్ ఫోటో

ప్రస్తుతం కోవిడ్ కారణంగా థియేటర్ లో విడుదల కావాల్సిన పెద్ద పెద్ద సినిమాలు వాయిదా పడగా.

ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలన్నీ ఓటీటీ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అంతేకాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉండగా.

ప్రస్తుతం మరో తెలుగు సినీ నటుడు ప్రియదర్శి పులికొండ నటించిన సిరీస్ కూడా విడుదల కానుంది.

ఈయన హాస్య పరమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.2016 విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమా తో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

అదే ఏడాది మరో సినిమా టెర్రర్ లో టెర్రరిస్ట్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు పాత్రల్లో బాగా మెప్పించాడు.ఎక్కువ హాస్య పూరిత పాత్రలలో నటించిన ప్రియదర్శి.

ప్రస్తుతం మరో లుక్ లో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వంలో విడుదలకానున్న వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ అఫ్ గాడ్'.

"""/"/ ఇక ఈ సిరీస్ లో ప్రియదర్శి, నందిని రాయ్ కీలక పాత్రలో నటించారు.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ కు సురేష్ కృష్ణ సంస్థ నిర్మిస్తుంది.

ఇక ఈ సిరీస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా.తాజాగా ఈ సిరీస్ పోస్టర్ విడుదలైంది.

ఎప్పుడు హాస్యభరితంగా ఉండే పాత్రలో కనిపించే ప్రియదర్శి.ప్రస్తుతం ఆ పోస్టర్ లో సిగరెట్ వెలిగిస్తూ సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు.

అంతేకాకుండా అందులో నందిని రాయ్ భయపడుతూ కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారగా.

ఇక ఈ సిరీస్ ను ఆహా ఓటీటీ విడుదల చేయనున్నారు.ఇక ఇప్పటికే పలు సిరీస్ లో నటించిన ప్రియదర్శి.

ఈ సిరీస్ తో ఎటువంటి గుర్తింపు ఆదుకుంటాడో చూడాలి.

ఎండాకాలంలో ఈ పండ్లకు దూరంగా ఉండటమే మంచిది..!