సారంగపాణి జాతకం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

టాలీవుడ్ నటుడు కమెడియన్ ప్రియదర్శి( Priyadarshi ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుసగా హిట్ లు అందుకుంటున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇటీవల కోర్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు.ఈ సినిమాతో భారీగా గుర్తింపు దక్కింది.

ఇకపోతే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ సినిమా పేరే సారంగపాణి జాతకం.

( Sarangapani Jathakam ) ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 25న విడుదల అయ్యింది.

ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.h3 Class=subheader-styleకథ:/h3p సారంగపాణి (ప్రియదర్శి) జాతకాల్ని ఎక్కువగా నమ్ముతాడు.

చేతిలో ఉన్నవి గీతలు కాదు మన తలరాతలు అనే టైపులో బతుకుతూ ఉంటాడు.

సారంగపాణి ఒక కారు కంపెనీలో సేల్స్ మెన్‌ గా పని చేస్తుంటాడు.అదే కంపెనీలో మైథిలీ (రూపా కొడవయూర్)( Roopa Koduvayur ) మేనేజర్‌ గా పని చేస్తుంటుంది.

అలా వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.ఇద్దరూ పెళ్లికి సిద్దపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది.

ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ (శ్రీనివాస్ అవసరాల)( Srinivas Avasarala ) ఒక షాకింగ్ విషయం చెబుతాడు.

నీ జాతకంలో ఒక హత్య చేస్తావు అని ఉందని చెప్పడంతో సారంగపాణికి ఏం చేయాలో పాలుపోదు.

ఒక వేళ పెళ్లి తరువాత ఆ హత్య చేస్తే మైథిలీ జీవితం ఏం అయిపోద్దో అని సారంగపాణి కంగారు పడతాడు.

పెళ్లికి ముందే తన జాతకంలో ఉన్న ఆ హత్యను చేసేయాలని తన ఫ్రెండ్ చందు (వెన్నెల కిషోర్)తో( Vennela Kishore ) సారంగ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.

ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చందు, సారంగ కలిసి చేసిన పనులు ఏంటి? చివరకు అహోబిల రావు (తణికెళ్ల భరణి)ని చంపాలని సారంగ ఎందుకు ఫిక్స్ అవుతాడు? చిరవకు సారంగ ఏం చేశాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

"""/" / H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p ఇందులో టేకాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌ గా అనిపించినప్పటికీ కూడా ఆ తరువాత కథలోకి లీనం అవుతారు.

సినిమా స్టార్టింగ్ ఒక ఇరవై నిమిషాలు అంతగా అనిపించక పోయిన మర్డర్ ఆలోచనలు రావడం, హత్య చేయడం గురించి వెన్నెల కిషోర్, ప్రియదర్శి మాట్లాడుకునే మాటలు ఎవరిని టార్గెట్ చేద్దామని ఆ ఇద్దరూ చేసే ప్రయత్నాలు కాస్త నవ్విస్తాయి.

అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగుతుంది.ఏం చేసినా తిరిగి బెడిసి కొట్టడంతో చివరకు తన బాస్‌ ను పైకి పంపించాలని అనుకుంటారు.

ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గానే ఉంటుంది.అలాగే ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ మరింత హిలేరియస్‌గా ప్లాన్ చేసుకున్నారు.

సెకండాఫ్ మొత్తం ఒకే చోట జరుగుతుంది.అయినా ఎక్కడా బోర్ కొట్టించలేదు.

వైవా హర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి త్రయం నవ్విస్తూనే ఉంటారు.వైవా హర్ష అయితే తన ఎక్స్‌ప్రెషన్స్‌ తోనే కడుపుబ్బా నవ్వించేస్తాడు.

అలా ప్రీ క్లైమాక్స్ వరకు హర్ష నవ్విస్తూనే ఉంటాడు. """/" / H3 Class=subheader-styleసాంకేతికత:/h3p సారంగపాణి జాతకం రైటింగ్‌ తోనే పాస్ అయినట్టుగా కనిపిస్తుంది.

అలాగే ఇంద్రగంటి మ్యాజిక్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.మ్యూజిక్ బాగుంది.

ఈ జనరేషన్ కి తగ్గట్టు ట్రెండీ డైలాగ్స్ కూడా రాశాడు.పంచ్‌ లు మాత్రం వర్షం కురిసినట్టుగా అలా కురుస్తూనే ఉంటాయి.

డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పాలి.పాటలు కూడా బాగానే ఉన్నాయి.

కానీ పెద్దగా గుర్తుండకపోవచ్చు.కెమెరా వర్క్ బాగుంటుంది.

ఎడిటింగ్ టీం పనితీరు కూడా బాగుంది.ముఖ్యంగా శ్రీదేవీ మూవీస్ బ్యానర్ బ్రాండ్ వ్యాల్యూ కనిపిస్తుంది.

H3 Class=subheader-styleనటీనటుల పనితీరు:/h3p ప్రియదర్శి తన కామెడీతో నవ్వించడంతోపాటు ఎప్పటిలాగే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఎమోషనల్ సీన్స్‌ లోనూ బాగా ఆకట్టుకుంటాడు.తన రేంజ్‌ లో చిన్నపాటి యాక్షన్స్ కూడా చేశాడు.

ఇక వెన్నెల కిషోర్, వైవా హర్ష ద్వయం చేసిన కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే.

ఈ ఇద్దరూ తమ తమ పాత్రల్లో నవ్వించేశారు.రూపా కొడవయూర్ తెరపై అందంగా కనిపించింది.

ఇక నరేష్, వడ్లమాని శ్రీనివాస్, తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు భాగానే నటించి మెప్పించారు.

H3 Class=subheader-styleరేటింగ్: 3.25/5/h3p.