అప్పుడు జరిగిన తప్పుకు చాలా బాధపడుతూ బన్నీకి సారీ చెప్పిన ప్రియావారియర్
TeluguStop.com
ప్రియా వారియర్ అనడం కంటే అప్పట్లో కన్ను కొట్టి మొత్తం దేశాన్ని షేక్ చేసిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తు పడతారేమో.
మలయాళి ముద్దుగుమ్మ ముద్దుగన్ పేల్చి కూడా అద్బుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో జనాలను కట్టి పడేసింది.
మలయాళంలో రూపొందిన ఒరు ఆదార్ లవ్ చిత్రంలో ఆ రెండు చిన్న బిట్ వీడియోలతో ఏకంగా ఇండియా ఫేమస్ సెలబ్రెటీ అయ్యింది.
ప్రియా వారియర్ నటించిన ఆ సినిమా ఒరు ఆదార్ లవ్ చిత్రం ఈ వ్యాలెంటెన్స్ డేకు విడుదల కాబోతుంది.
రికార్డు స్థాయిలో అంచనాలున్న ఆ చిత్రాన్ని తెలుగులో కూడా లవర్స్ డే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
నేడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా లవర్స్ డే ఆడియో విడుదల కార్యక్రమం జరుగబోతుంది.
ఆడియో విడుదల కార్యక్రమం కోసం ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ముందుగానే హైదరాబాద్ చేరుకుని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానంను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అయితే తాను చేసిన తప్పు వల్ల అల్లు అర్జున్‌కు ఇప్పుడు సారీ చెప్పింది.
అల్లు అర్జున్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు నేను నో చెప్పానంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
గత సంవత్సరం నేను ఒరు ఆదార్ లవ్ చిత్రం షూటింగ్ లో ఉన్న సమయంలో నాకు అల్లు అర్జున్ మూవీలో నటిస్తారా అంటూ ఆఫర్ వచ్చింది.
అయితే ఆ ఆఫర్‌ను తిరష్కరించాను.అప్పుడు ఒరు ఆదార్ లవ్ చిత్రం షూటింగ్‌లో ఉండటం వల్ల మరే సినిమాకు కమిట్ అయ్యే అవకాశం నాకు లేదు.
నేను వారికి ఇచ్చిన కమిట్‌మెంట్ అలాంటిది.దాంతో నేను అల్లు అర్జున్ మూవీ మిస్ అయ్యాను.
కాని అల్లు అర్జున్ తో మరోసారి నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంది.
మరి నేడు అల్లు అర్జున్ ఈ ముద్దు గన్ ముద్దుగుమ్మకు మరో ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.
షాకింగ్ వీడియో.. డ్రైవర్ పొరపాటుతో మొదటి అంతస్తు నుంచి కిందపడిన కారు