హీరోయిన్ కు చుక్కలు చూపించిన గంగవ్వ.. ఏమైందంటే..?

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైన గంగవ్వ బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

సోషల్ మీడియాపై గంగవ్వకు కనీస అవగాహన లేకపోయినా ఆమెకు సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

బిగ్ బాస్ షో తర్వాత ప్రముఖ సెలబ్రిటీలు సైతం గంగవ్వను కలుస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కావడానికి ముందు నాగార్జున గంగవ్వతో కలిసి ఆ సినిమాను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సైతం తన కొత్త చిత్రం ఇష్క్ ప్రమోషన్స్ కోసం గంగవ్వను కలిశారు.

జాంబి రెడ్డి సినిమాతో సక్సెస్ అందుకున్న తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

"""/"/ ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా గత కొన్నేళ్లుగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

కన్నుగీటుతో పాపులర్ అయిన ప్రియా వారియర్ గంగవ్వను కలవగా గంగవ్వ కన్ను కొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ మూతులు తిప్పే విషయంలో గంగవ్వ ప్రియా ప్రకాష్ వారియర్ కు ట్రైనింగ్ ఇచ్చారు.

తన మాటలు, చేష్టలతో గంగవ్వ ప్రియా వారియర్ కు చుక్కలు చూపించడం గమనార్హం.

గంగవ్వ, ప్రియా వారియర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రియా వారియర్ కన్ను కొట్టినా మూతి తిప్పినా కూడా అందంగానే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్, కల్కి కంటే ఎక్కువ బడ్జెట్ తో రామాయణం.. ఏకంగా అన్ని వందల కోట్లా?