ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా….?

తెలుగులో ఒకప్పటి ప్రముఖ హీరో వడ్డే నవీన్ హీరోగా నటించినటువంటి "బాగున్నారా.!" అనే చిత్రం ద్వారా  తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి నటి "ప్రియా గిల్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి ప్రియా గిల్ తెలుగు లో నటించింది కేవలం రెండు చిత్రాలలోనే అయినప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది.

కాగా ఈమె తెలుగులో నటించినటువంటి మరో చిత్రం రాయలసీమ రామన్న చౌదరి.  ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే  ఆకట్టుకుంది.

కానీ ఈ అమ్మడికి హిందీ లో వరుస అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి సారించలేక పోయింది.

అంతేగాక ప్రియ గిల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, బోజ్ పూరి, తదితర భాషలలో కూడా నటించింది.

కాగా చివరగా ప్రియా గిల్  భైరవి అనే చిత్రంలో నటించింది.ఆ తరువాత మళ్లీ ఇప్పటివరకు ఈమె గురించి ఎలాంటి సినిమా వార్త సమాచారం లేదు.

అయితే సినిమా పరిశ్రమకు దూరం అయినప్పటి నుంచి నటి ప్రియా గిల్ సినిమా పరిశ్రమలోని ఎలాంటి  వేడుకలకు హాజరు కావడం లేదు.

  దీంతో ఈమె గురించి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

  ఇందులో ముఖ్యంగా ప్రియా గిల్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుందని అందువల్లనే సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసి తన భర్తకి వ్యాపార పనుల్లో తోడుగా ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.

కానీ ఇప్పటివరకు ప్రియా గిల్ మాత్రం తన పెళ్లిపై వస్తున్నటువంటి వార్తలపై స్పందించలేదు.

ఇలా చేస్తే ఎలా యంగ్ టైగర్ .. ఆ టార్గెట్ ను అందుకోవడం సాధ్యమేనా?