కరోనా టీకా అని నమ్మించి మత్తు మందు ఇచ్చి.. ఇంత ఘోరమా.. ?

మోసం చేయడానికి కరోనా టీకాను కూడా వాడుతున్నారు మనుషులు.ఛీ ఇలాంటి సమాజంలో కలుపు మొక్కలు కాకుంటే ఇంకేం ఎదుగుతాయి.

ఇక అసలు విషయానికి వస్తే కరోనా టీకా అని నమ్మించి వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడిన ఓ నర్సు భాగోతం హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో వెలుగు చూసింది.

ఇకపోతే మీర్‌పేట పీఎస్‌ పరిధిలోని లలితనగర్‌లో కస్తూరి, లక్ష్మణ్ అనే దంపతులు నివాసముంటున్నారు.

కాగా లక్ష్మణ్ ఎలక్షన్‌ కమిషన్‌ స్టేట్‌ ఆఫీస్‌లో అకౌంటెట్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు.

ఈ క్రమంలో వారి వద్ద డబ్బు ఉన్న విషయం తెలుసుకున్న ఓ నర్సు, మొదట పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చిందట.

అయితే వారికి షుగర్‌ ఉండటంతో ఆ పాయసాన్ని పారబోశారట.తర్వాత ప్లాన్ చేంజ్ చేసిన ఆ కిలాడి నర్స్ కొవిడ్ వ్యాక్సిన్ అంటూ ఆ దంపతులకు మత్తు మందు ఇచ్చిందట.

దీంతో వారు స్పృహ కోల్పోవడంతో, వారి వద్ద ఉన్న 8 తులాల బంగారాన్ని చోరీ చేసి పారిపోయిందట.

ఇక మత్తు నుండి కోలుకున్న ఆ దంపంతులు జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారట.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలు అనూషను అరెస్ట్ చేశారట.

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న గీతూ రాయల్.. 40 ఏళ్లకే చనిపోతారంటూ?