తెలంగాణలో పలు ప్రైవేట్ జూ. కాలేజీలకు అనుమతులు రద్దు..!

తెలంగాణలో పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుమతులు రద్దు అయ్యాయి.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 24 కాలేజీల అనుమతులను రద్దు చేసింది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే కళాశాల విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఈ మేరకు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల జాబితాను జిల్లా విద్యాధికారులకు పంపింది.ఫస్టియర్ విద్యార్థులను ఇతర ప్రైవేట్ కాలేజీలకు బోర్డు అటాచ్ చేసింది.

అదేవిధంగా సెకండియర్ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏదో తేడా కొడుతుంది నాగి..మళ్ళీ ప్రమోషన్స్ మొదలెడదామా…?