ఆ షూట్ లో కెమెరా ఆపరేటర్ గా రానా ను చూసి షాక్ అయ్యాను : పృథ్విరాజ్
TeluguStop.com
సలార్ సినిమాతో( Salaar ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు పృథ్విరాజ్ సుకుమారన్.
( Prithviraj Sukumaran ) తెలుగు వాళ్లలో తెలుగువాడిగా కలిసిపోయారు.ఈ సినిమా తర్వాతే అతనిని అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టి ఆయన పాత సినిమాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు.
అంతలా పృథ్విరాజ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు.అయితే పృథ్వీరాజ్ ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
తనకు అత్యంత ఆప్తుడు మంచి మిత్రుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం ప్రభాస్ అని చెప్పిన పృథ్వీరాజ్ ప్రభాస్( Prabhas ) కాకుండా మరొక మిత్రుడు పేరు చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అది రానా దగ్గుబాటి( Rana Daggubati ) అని చెప్పారు.
"""/" /
అది ఎందుకు అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు.రానా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చి సినిమాల గురించి పూర్తిగా నేర్చుకోకుండా పరిశ్రమకు వస్తే ఎవరో చేసిన పనికి తనకు అర్థం తెలియదని హీరో అవ్వడానికి ముందు రానా చేసిన పని వల్ల అతడికి పృథ్వీరాజ్ మంచి మిత్రుడు అయ్యాడట.
ఒక తెలుగు సినిమా లో మెయిన్ లీడ్ గా కొన్నేళ్ల క్రితం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నాడట.
సరిగ్గా అదే సమయంలో మరో ముఖ్యమైన పాత్రులు నటిస్తున్న రఘువరన్( Raghuvaran ) కన్నుమూశారట.
దాంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఆ సినిమా మళ్లీ మొదలవకుండా ఇప్పటికీ కూడా పూర్తి చేసుకోలేక పోయిందట.
"""/" /
ఇక ఆ సినిమాకి కెమెరా ఆపరేటర్ గా రానా వచ్చాడట.
రానా తలుచుకుంటే వందల సినిమాలు ఒకేసారి తెరకెక్కించగల బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి అయినా కూడా కేవలం కెమెరా లేదా కెమెరా ఆపరేటర్ గా రావాల్సిన అవసరం ఆయనకు లేదు.
కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలని రానా తనకు తాను మలుచుకున్న విధానానికి పృధ్విరాజ్ అభిమానిగా మారిపోయి ఆ తర్వాత అతనితో స్నేహం చేయడం మొదలు పెట్టాడట.
అప్పటినుంచి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉందట.అంతేకాదు ఎన్నోసార్లు రానా నీ తన ఇంటి దగ్గర తన కారులో డ్రాప్ చేశాడట పృథ్వీరాజ్.
అతనే నా ఫస్ట్ క్రష్….మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!