దొరికిపోతానేమో అనే భ‌యంతో ఫోన్ మింగేసిన ఖైదీ.. చివ‌ర‌కు ఏమైందంటే..

జైలులో ఉండే ఖైదీల‌కు బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధ‌మే ఉండ‌దు.బ‌య‌ట ఏం జ‌రుగుతుందో వారికి అస్స‌లు తెలియ‌దు.

అయితే ఇలా బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధాలు పెంచుకునేందుకు వారు దొంగ‌త‌నంగా ఫోన్‌లు సంపాదించుకుంటారు.

అయితే ఇలా ఫోన్‌లు సంపాదించుకున్న‌ప్పుడు దొర‌క్కుండా ఉండేందుకు చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటారు.ఇలా ఓ దొంగ కూడా జైలులో ఫొన్‌ను సాధించాడు.

కానీ ఎక్క‌డ పోలీసుల‌కు దొరికిపోతానే అనే భ‌యంతో ఎవ‌రూ చేయ‌కూడ‌ని ప‌ని చేసి చాలా ఇబ్బందులు ప‌డ్డాడు.

ఇక ఫోన్‌తో రోజూ త‌న కుటుంబీకుల‌తో ప‌రిచ‌య‌స్తుల‌తో మాట్లాడ‌టం స్టార్ట్ చేసిన ఆ ఖైదీ.

ఎంచ‌క్కా ఇలా ఫోన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు.ఢిల్లీ లో ఉన్న‌టువంటి తిహార్ జైలులో ఓ ఖైదీ ఇలా ఫోన్‌ను సంపాదించుకున్నాడు.

అయితే అత‌ని మీద పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో అత‌ని మీద గ‌ట్టి నిఘా పెట్టారు.

ఇక పోలీసుల‌కు దొర‌క్కుండా ఉండేందుకు ఓ రోజు ఫోన్ ను అమాంతం మింగేశాడు.

కాగా అత‌ను పూర్తిగా మింగేయ‌కుండా.గొంతులో కొంత మింగి అలాగే ఉంచుకుని.

పోలీసులు వెళ్లిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసుకుని వాడుకోవాల‌ని అనుకున్నాడు.కానీ దురదృష్ట వ‌శాత్తు ఆ ఫోన్ క‌డుపులోనికి వెళ్లిపోయింది.

ఇక ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు అత‌న్ని వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు.

ఇక అత‌నికి అన్ని ర‌కాలుగా వైద్య చికిత్స‌లు చేసిన డాక్ట‌ర్లు.ఎండోస్కోపీ సర్జరీ ద్వారా ఆ మొబైల్ ను బ‌య‌ట‌కు తీశారు.

ఇందుకోసం వారు ఓ చిన్న వలను వాడుకున్నారు.ఇక అత‌ని క‌డుపులోకి వెల్లిన ఆ ఫోన్ దాదాపు ఏడు సెంటీ మీటర్ల పొడవు ఉంద‌ని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఆ ఖైదీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.ఇక జైలులోకి ఫోన్ ఎలా వ‌చ్చింద‌నే అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Lemon Crop : నిమ్మ తోటల్లో పూత నియంత్రణ యాజమాన్యంలో పాటించాల్సిన సరైన మెళుకువలు..!