జైలులో మహిళను రేప్ చేయడానికి ఖైదీ ప్రయత్నం.. వీడియో వైరల్..
TeluguStop.com
అరిజోనా( Arizona ) రాష్ట్రంలోని ఒక జైలులో చాలా భయంకరమైన సంఘటన జరిగింది.
ఆ జైలులో ఖైదీగా ఉన్న జస్టిన్ అవేరి (29) అధికారులు గమనించకుండా నేలపై పాకుతూ మహిళల విభాగం వైపు వెళ్లాడు.
కోర్టు రికార్డుల ప్రకారం, అవేరి(Avery ) జైలులో ఉన్న మరో మహిళను అత్యాచారం చేయాలని ప్లాన్ చేశాడట.
ఈయన, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ దగ్గర ఐదుగురు మహిళలను ఇంతకు ముందే ఇదే విధంగా అత్యాచారం చేశాడు.
అందుకే అతన్ని కటకటాల పాలు చేశారు.కోర్టు రికార్డుల ప్రకారం, జస్టిన్ అవేరి అనే ఆ వ్యక్తి, జైలులో ఉన్న మరో మహిళ అందంగా ఉందని ఆమెకు ఆకర్షితుడయ్యాడు.
ఒక చిన్న స్పైడర్ వలె చప్పుడు చేయకుండా పాకుతూ మహిళల విభాగం వైపు వెళ్లాడట.
అక్కడ నిద్రిస్తున్న మహిళ వెనుక వెళ్లి, తన ప్యాంట్‌ను విప్పేశాడట.ఆమెను అత్యాచారం చేయాలని ప్లాన్ చేశాడని అతను ఒప్పుకున్నాడు.
"""/" /
కానీ అతని ప్లాన్ ఫెయిల్ అయ్యింది.అక్కడే ఉన్న మరో మహిళ అతనిని చూసి, "ఏం చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో!" అని బిగ్గరగా అరిచింది.
అవేరి ఆమెను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ, ఆ శబ్దం విని అధికారులు అప్రమత్తమై మరి కొంతమంది అధికారులను పిలిచారు.
దీంతో అవేరిని పట్టుకుని అతనిపై మరో అత్యాచారం కేసు పెట్టారు. """/" /
ఈ సంఘటన ఏప్రిల్ నెలలో జరిగినప్పటికీ, ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.
మారికోపా కౌంటీ షెరిఫ్ ఆఫీస్ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, "అవేరి చేసిన పనికి మేము చాలా షాక్ అయ్యాము" అని చెప్పింది.
"ఈ రకమైన సంఘటన జరగడం ఇన్‌టేక్ ట్రాన్స్‌ఫర్ అండ్ రిలీజ్ ఫెసిలిటీలో ఇదే మొదటిసారి.
" అని తెలిపింది.మళ్లీ ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా అద్దాలు అమర్చామని కూడా తెలిపింది.
మహిళా ఖైదీలను ఎవరూ రేప్ చేయకుండా ఉండడానికి తగిన పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించింది.
మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందా.. బాలయ్య కొడుకుకే ఎందుకిలా?