డ్యాన్స్‌ లైఫ్‌ ఇస్తే జైలు జీవితాన్ని నేర్పించింది.. జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

జానీ మాస్టర్( Johnny Master ).గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

ఒక కేసులో భాగంగా ఆయన జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.చాలామంది జానీ మాస్టర్ కు మద్దతుగా నిలవగా మరి కొంతమంది ఆయనపై మండి పడుతూ ఆయనకు శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చారు.పోక్సో కేసులో( POCSO Case ) జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌…ఎట్టకేలకు రిలీజయ్యారు.

"""/" / అవకాశాల పేరుతో తనను బెదిరించి జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ( Assistant Choreographer )గత నెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య పేరును కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

2019లో మైనర్‌గా ఉన్నప్పటి నుంచే తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని బాధితురాలు వాంగ్మూలంలో వెల్లడించారు.

దాంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సెప్టెంబర్‌ 19న అరెస్ట్ చేశారు.

ఫలితంగా జానీ మాస్టర్‌ 36 రోజులపాటు చంచల్‌గూడలో జైలు జీవితం గడిపారు. """/" / తాజాగా కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు.

అయితే ఇటీవల జైలు నుంచి వచ్చిన ఆయన జీవితం అంటే ఏంటో జైలు నేర్పించింది అని మాట్లాడారు.

జైలు నుంచి వచ్చిన తర్వాతకానీ మాస్టర్ మాట్లాడిన మొదటి మాట అదే.డాన్స్ లైఫ్ ని ఇస్తే, జైలు జీవితాన్ని నేర్పించారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు జానీ మాస్టర్.

కండరాల బలహీనతకు కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలి?