నిబంధనల మేరకు ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణ చేపట్టాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణను నిబంధనల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్లు ప్రింట్ లైన్ యందు స్పష్టంగా సూచించాలని, ముద్రించబడిన ప్రతులను ( ప్రింటడ్ మెటీరియల్ కాపీలను) 3 అదనపు ప్రింట్ లతో పాటు ప్రింట్ చేసిన మూడు రోజుల్లోపు ప్రచరణ కర్త నుండి పొందిన డిక్లరేషన్ తో సహా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నందు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127(ఏ) ప్రకారం పంపాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ లు ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, మొదలైన వాటి ముద్రణ చేపట్టే ముందు నిర్దేశించిన ప్రోఫార్మా లో సెక్షన్ 127 ఏ (2) ప్రకారం ప్రచురణకర్త నుంచి డిక్లరేషన్ పొందాలని, డిక్లరేషన్ పై ప్రచురణకర్త సంతకం, సూచించిన ఇద్దరు వ్యక్తులచే ధ్రువీకరించబడాలని, దీనిని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ యజమాని ధ్రువీకరించాలని తెలిపారు.
ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్ తో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య సదరు ప్రింటింగ్ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రింటర్లు మూడు రోజుల్లోపు అందించాలని, అట్టి ప్రతి ముద్రించిన మూడు రోజుల్లోపు ముద్రించిన ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రింటర్ ఒకేసారి కాకుండా విడిగా అందించాలని, ఈ ఆదేశాలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్ రద్దు చేయడంతో సహా ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు ఇతర ప్రచార సామాగ్రిని నిర్ధేశించిన సంఖ్యకు మించి జీరాక్సులు తీయడం, పలు పత్రాలుగా సంఖ్య పెంచి పంపిణీకి వినియోగించినచో, ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లుగా భావించి ఆరు నెలలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా లేదా రెండు శిక్షలు కూడా అమలు చేయబడుతాయన్నారు.
ఎదురే లేని రో ఖన్నా .. మరోసారి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నిక