శివకార్తికేయన్ 'ప్రిన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టుగా రౌడీ స్టార్.. ఇంకా..

జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి.

ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అనుదీప్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్ తో బైలింగ్వన్ సినిమా చేస్తున్నాడు.

వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న ఈ స్టార్ హీరోతో ఈ జాతిరత్నం చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

వీరిద్దరి కాంబోలో ప్రిన్స్ సినిమా తెరకెక్కింది.ఈ మధ్య కాలంలో శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

దీంతో ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు.మరి ఈ క్రమంలోనే ఈసారి ప్రిన్స్ సినిమాతో రాబోతున్నాడు.

పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇందులో బ్రిటీష్ భామ మరియా ర్యాబోష హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు గ్రాండ్ గా జరగనుంది.

"""/"/ మరి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 18 సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించ నున్నారు.

మరి ఈ వేడుక కోసం టాలీవుడ్ స్టార్స్ కదిలి రానున్నారు.వారు ఎవరంటే చీఫ్ గెస్టుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అలాగే స్పెషల్ గెస్టులుగా రానా దగ్గుబాటి, డైరెక్టర్ హరీష్ శంకర్ రానున్నారు.

ఈ విషయాన్నీ తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.మరి ఈ కాంబో విజయాన్ని అందుకుంటారో లేదో కొద్దీ రోజులు ఆగితే తెలుస్తుంది.