తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానంగా మాట్లాడారు..: కేటీఆర్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని అవమానంగా మాట్లాడారని తెలిపారు.చారిత్రక వాస్తవాల పట్ల ప్రధాని నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు.అంతేకాకుండా లెక్కలేనన్ని త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని ప్రధాని చెప్పడం సరికాదన్నారు.కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నంలో మోదీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

అడుగడుగునా దగా.ప్రశ్నిస్తే పగ జుమ్లా.

హమ్లా డబుల్ ఇంజన్ సర్కార్ మీది అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..