ప్రధాని మోడీ విమర్శలపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక మౌనం
TeluguStop.com
ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) తెలంగాణ పర్యటకు వచ్చిన ప్రతి సారి కూడా బీఆర్‌ఎస్( BRS ) మరియు బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్దం మనం చూస్తూనే ఉన్నాం.
బీజేపీ ముఖ్య నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్న ఈ సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు కూడా సైలెంట్ గా ఉండకుండా విమర్శలు చేస్తూ ఉన్నారు.
మొన్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ లో పర్యటించిన సందర్భంగా కేసీఆర్( KCR ) పై మరియు బీఆర్‌ఎస్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
అభివృద్ది విషయంలో బీజేపీ( BJP ) మాత్రమే తెలంగాణ కు న్యాయం చేస్తుంది అంటూ మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కుటుంబ పాలన కారణంగా రాష్ట్రం అభివృద్ది చెదడం లేదని.అంతే కాకుండా రాష్ట్రం లో అవినీతి పెరిగి పోయిందని.
అధికార పార్టీకి చెందిన వారు అవినీతిలో కూరుకు పోయారు అంటూ ప్రధాని నరేంద్ర ఆరోపించారు.
"""/" /
మొన్నటి సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు.సాధారణంగా అయితే ప్రధాని స్థాయి విమర్శలకు కేసీఆర్ సమాధానం చెబితే బాగుంటుంది.
కానీ ఇప్పటి వరకు మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) మినహా మరెవ్వరు కూడా స్పందించలేదు.
ఈ విషయంలో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా స్పందించడం లేదు.
మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విమర్శలను కూడా లైట్ తీసుకున్నారు అంటూ తేలిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విమర్శలపై స్పందించడం వల్ల పెద్ద గా ప్రయోజనం లేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
అందుకే పెద్దగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.రాబోయే ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య యుద్ద వాతావరణం నెలకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ