ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని దేశ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల పరుశరాములు, నాయకులు దూస శ్రీనివాస్, సందుపట్ల రాజిరెడ్డి, నేవూరి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘సీజ్ ది షిప్ ‘ ఇంకా రచ్చ రచ్చగానే రాజకీయం