ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
TeluguStop.com
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి.
ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ( BJP ) ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.
అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు.
అయితే రానున్న లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగానే మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం.
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?