తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది.

ఈ మేరకు రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వ్యూహాత్మకంగా కామారెడ్డిలో కమలనాథులు సభను ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఈనెల 25న కామారెడ్డి నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

కాగా సభా వేదికపై నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా మోదీ విమర్శలు చేసే అవకాశం ఉంది.

ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..