ప్రధాని మోడీ దీపావళి కానుక 75 వేల మందికి నియామక పత్రాలు అందజేత..!!

మహమ్మారి కరోనా కారణంగా చాలా దేశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నాయని మోడీ తెలిపారు.

శనివారం మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని అన్నారు.

ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయి.వంద సంవత్సరాలకి  ఒక్కసారి వచ్చే మహమ్మారి దాని ప్రభావాలు.

వంద రోజుల్లో తొలగిపోయేవి కావు.ఇక ఇదే సమయంలో దేశంలో కరోనా ప్రభావం అది మిగిల్చిన నష్టాలు గురించి వివరించారు.

ఈ సంక్షోభంలో దేశం పడిపోకుండా కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అనేకమైన నూతన చర్యలను తీసుకుంటుందని స్పష్టం చేశారు.

యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తొందన్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75 వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు.

పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజ్ గార్ మేళా రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ పై ప్రశంసలు కురిపించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ట్వీట్ వైరల్..