అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కీలక ప్రసంగం..

ఇటీవల వరుసగా పలు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ( Narendra Modi ) వెళుతున్నారు.

గత కొద్దిరోజుల పలు దేశాల్లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే.ఇతర దేశాలతో స్నేహబంధం ఏర్పరుచుకునేందుకు, స్నేహబంధాన్ని కొనసాగించేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తోన్నారు.

అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండేందుకు వివిధ దేశాల్లో మోదీ పర్యటిస్తున్నారు.ఇటీవల వివిధ దేశాల్లో పర్యటించి ఆ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భేటీ అయ్యారు.

అయితే త్వరలో అమెరికా( America ) పర్యటనకు మోదీ వెళుతున్నారు.ఈ పర్యటనలో భాగంగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )విందు ఇవ్వనున్నారు.

ఈ నెల 22న మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పాల్గొని మాట్లాడనున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.అమెరికా కాంగ్రెస్ అగ్రనేతలు దీనిపై ప్రకటన చేశారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

/br> """/" / ఈ నెల 22న అమెరికాకు మోదీని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ల ద్వైపాక్షిక నాయకత్వం తరపున సమావేశంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నట్లు అమెరికా కాంగ్రెస్ అగ్రనేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో మోదీ గతంలోనూ ఒకసారి ప్రసంగించారు./br> """/" / ఇప్పుడు రెండోసారి ప్రసంగించనున్నారు.

గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టర్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండుసార్లు ప్రసంగించారు.

ఇప్పుడు వారి సరసన చేరి మోదీ అరుదైన ఘనతను దక్కించుకోనున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు.

అమెరికాలోని పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు.ఈ సందర్బంగా మోదీ టార్గెట్‌గా చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.

ఈ సమయంలో మోదీ అమెరికా పర్యటన వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

వైరల్ వీడియో: ఎందుకయ్యా ఇలా తయారయ్యారు.. బ్రతికున్న చేపలతో డ్రింక్..