ఉగ్రవాదులకుభారత్ సరైన సమాధానం చెబుతోంది! ప్రధాని మోడీ హెచ్చరిక!

పుల్వామా ప్రాంతంలో శ్రీనగర్ నేషనల్ హైవే పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి అందరికీ తెలుసు.

ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ నేరుగా ప్రకటించుకుంది.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు వెంటనే తీసుకోవాలని దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖులు వరకు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

ఇక ఉగ్రవాదులు పాల్పడిన ఈ కిరాతకానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రులు ఎప్పటికీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు.

ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన మోడీ వారి కుటుంబాలకు అండగా నిలబడతామని మాటిచ్చారు.

అలాగే సైన్యం ధైర్య సాహసాల గురించి తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ దాడిపై సరైన సమయంలో సరైన విధంగా సైన్యం తన యాక్షన్ కి సిద్ధమవుతుందని మోడీ తెలియజేశారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికిపాల్పడిన ఉగ్రవాదులు ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరికలు పంపించారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం..: సీఎం జగన్