ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని మోదీ సంచలన ప్రకటన..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు వారాలలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బీజేపీ పార్టీ భారీ ఎత్తున బహిరంగ సభలో నిర్వహిస్తోంది.ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ సభలో పాల్గొనడం జరిగింది.
తాజాగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో అనగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ పై సంచలన ప్రకటన చేశారు. """/" /
వర్గీకరణ విషయంలో న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని.
దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు.ఇదే సమయంలో అంబేద్కర్ కలలను తాము నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
మాదిగల ఉద్యమాన్ని గుర్తించామని గౌరవిస్తున్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఎస్సీ వర్గీకరణ పై త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు.
వర్గీకరణకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాం.ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో న్యాయమైన పోరాటం జరుగుతుంది.
ఇప్పటివరకు మందకృష్ణ మాదిగకు ఎంతోమంది మద్దతుగా నిలిచారు.ఈ విషయంలో నేను స్వయంగా రంగంలోకి దిగుతున్నాను.
మందకృష్ణ మాదిగ వెనకాల నేను ఉండి.న్యాయం జరిగేలా చూస్తాను అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
డోర్ తీసి మనుషులన్న కారులోకి దూరిన ఎలుగుబంటి.. వీడియో చూస్తే..