ఈ బంకుల్లో ఇకనుండి 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ దొరుకును… ఏయే బంకుల్లో అంటే?

కాలం మారుతోంది.ప్రపంచ దేశాలు అన్నీ కూడా పర్యావరణ కాలుష్యం అరికట్టేందుకు కంకణం కట్టుకున్నాయి.

ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను లాంచ్‌ చేస్తున్న విషయాన్ని మీరు గ్రహించే వుంటారు.

అందులో భాగంగానే భారత్ ఉద్గారాలను తగ్గించుకునేందుకు కీలక అడుగు వేసింది.జీవ ఇంధన వినియోగాన్ని పెంచే విధంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 20% ఇథనాల్‌ కలిపి పెట్రోల్‌ను విక్రయించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తాజాగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.

"""/" / నాటినుండి నేటివరకు కూడా పెట్రోల్‌లో 10% ఇథనాల్ కలిపి బ్యాంకుల్లో విక్రయిస్తున్న సంగతి మీకు తెలుసా? అయితే ఏప్రిల్‌లో జరిగే ఇండియా ఎనర్జీ వీక్ -2023 సందర్భంగా 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం చాలా పగడ్బందీగా ప్లాన్ వేసింది.

కాగా రెండు నెలల ముందే ప్రధాని మోదీ దీనిని ప్రారంభించడం గమనార్హం.అయితే 2025 నాటికి పెట్రోల్‌లో10% ఇథనాల్ ఈ పరిమాణాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.

మొదటి దశలో 15 నగరాల్లో ఎంపిక చేసిన బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విక్రయించనున్నారు.

అయితే రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. """/" / ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా అనేక లాభాలున్నాయి.

అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది, పరోక్షంగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది.అంతేకాకుండా ఫారెక్స్ అవుట్‌గోలో భారత్‌కు రూ.

53,894 కోట్లు ఆదా కానుందంటే మాటలా? E-20 పెట్రోల్ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని 3 ఇంధన రిటైలర్స్‌కు చెందిన 84 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి రానుంది.

చెరకుతో పాటు విరిగిన బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ తయారు చేస్తున్నారు.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్‌ ఉంది.ఇకపై చమురు దిగుమతిని తగ్గించుకోవడంలో ఈ చర్యలు ఇండియాకు బాగా ఉపయోగపడనున్నాయి.

నోటి పూతతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ రెమెడీస్ మీకోసమే!