సంప్రదాయ వస్త్రధారణలొ ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కేదార్ నాథ్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు.

రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన.కేదార్ నాథ్, బద్రీనాథ్ ధామ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల పొడవైన రోప్ వే ప్రాజెక్టు, జాతీయ రహదారి 7, 107 విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

పర్యటన నేపథ్యంలో కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలను పూలతో అలంకరించారు.హిమాచలి సంప్రదాయ వస్త్రధారణతో మోదీ మొదటి సారి కనిపించారు.

చోలా డోరా ధరించి కేదార్ నాథ్ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.అనంతరం ఇక్కడి నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళ్లనున్నారు.

భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి  తెరపైకి  విడాకుల వార్తలు?