వీడియో వైరల్: బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు

సాధారణంగా ఏదైనా ఉత్సవాలు, వివాహ ఊరేగింపులు జరిగే సమయంలో డ్యాన్స్‌ చేయడం చాలా సహజం.

ముఖ్యంగా పెళ్లిళ్లలో డ్యాన్స్‌ అంటే మామూలు విషయం కాదు.కొందరు పూర్తిగా మద్యం సేవించి ఉత్సాహంగా నృత్యం చేస్తుంటే, మరికొందరు "పెళ్లి కదా, ఆ మాత్రం ఎంజాయ్‌ చేయాలి" అంటూ నచ్చినట్టుగా డ్యాన్స్‌ వేస్తుంటారు.

ఈ మధ్యకాలంలో అయితే డిజే మ్యూజిక్‌ లేకుండా పెళ్లి ఊహించలేనంతగా మారిపోయింది.పెళ్లిళ్లతో పాటు ఉత్సవాలకూ డిజే మ్యూజిక్‌ తప్పనిసరి అయ్యింది.

"""/" / ఇది ఇలా ఉండగా.మరోవైపు దైవ కార్యాలు, దేవాలయ ఉత్సవాలు( Divine Works , Temple Festivals ) అయినా ఇప్పటి యువత డిజే మ్యూజిక్‌ లేకుండా సరదాగా ఎంజాయ్‌ చేయలేని పరిస్థితి.

ఒకప్పుడు వివాహమైనా, దేవుని ఉత్సవమైనా మంగళ వాయిద్యాలు వినసొంపుగా ఉండేవి.కానీ, ఇప్పుడు ఆధునిక సంగీత పద్ధతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

అందుకే, కొన్ని దేవాలయాల్లోనూ భక్తుల కోరిక మేరకు డిజే ఏర్పాటు చేస్తున్నారు.సాధారణంగా ఇలాంటి వేడుకల్లో భక్తి గీతాలు మోగుతాయి.

ఆ పాటలతో భక్తులు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తుంటారు.అయితే, తాజాగా శ్రీకాకుళం జిల్లా ( Srikakulam )మందస గ్రామంలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

"""/" / శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో( Sri Vasudeva Perumal Temple ) 16వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వాహకులు డిజే ఏర్పాటు చేయగా, భక్తి గీతాలకు యువకులు తెగ డ్యాన్స్‌ చేశారు.

అయితే, ఈ వేడుకలో అసలు విశేషం ఏమిటంటే.అక్కడ ఉన్న పూజారులు కూడా యువతతో కలిసి డ్యాన్స్‌ చేయడం.

వారు చేసిన స్టెప్పులు, ఫ్లోర్ మూమెంట్స్‌ చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.ఓ మోస్తరు నృత్యం కాకుండా, నిజమైన డ్యాన్సర్లను తలదన్నేలా స్టెప్పులు వేశారు.

ఇది పూర్తిగా భక్తి గీతాలకే అనుగుణంగా జరిగినప్పటికీ, ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వీడియోను అక్కడే ఉన్న కొందరు తమ మొబైల్‌ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.

ఎంతోమంది ఈ వీడియోను షేర్‌ చేస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలోనూ జలుబు వేధిస్తుందా.. అయితే ఇలా చేయండి!