గుడిలో గబ్బుపని చేసిన పూజారి

గుడిలో గబ్బుపని చేసిన పూజారి

గుడిలో నిత్యం పూజలు చేసే ఓ పూజారి బుద్ధి వక్రించడంతో పవిత్ర దేవాలయంలో పాడుపని చేయబోయాడు.

గుడిలో గబ్బుపని చేసిన పూజారి

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా అమరాతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది.

గుడిలో గబ్బుపని చేసిన పూజారి

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.విజయవాడకు చెందిన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠపురంలోని ఆలయానికి విచ్చేసి సంతానం కోసం పూజలు నిర్వహించారు.

ఈ క్రమంలో పూజారి ఆ మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆమెను ఏకాంతంగా కలిశాడు.

ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ పూజారి.దీంతో ఆ మహిళ అతడిని ఎదురించి, గట్టిగా కేకలు వేసింది.

అంతే ఆ పూజారి అక్కడి నుండి దెబ్బకు పారిపోయాడు.ఈ ఘటనను ఆ దంపతులు గ్రామంలో చెప్పి వెళ్లిపోయారు.

కాగా గ్రామస్తులు ఆ పూజారిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించి పరారీలో ఉన్న ఆ పూజారిపై దేవాదాయ అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ ఘటనపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?

భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?