Bhamakalapam 2 : ప్రియమణి, శరణ్యల టెరిఫిక్ పర్ఫామెన్స్ ..వడ్డించిన విస్తరిలా “భామాకలాపం”
TeluguStop.com
భామాకలాపం సినిమా 2022లో రిలీజ్ అయ్యే చాలామందిని ఆకట్టుకుంది.ఇదొక డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్.
ఇందులో ప్రియమణి, కిషోర్, జాన్ విజయ్, శాంతిరావు, శరణ్య ప్రదీప్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు.
అభిమన్యు తాడిమేటి కథ అందించడమే కాక ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు."భామాకలాపం" ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఒక వెబ్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది.
దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో భామాకలాపం 2( Bhamakalapam 2 ) పేరిట ఓ సీక్వెల్ కూడా తీశారు.
ఇది ఫిబ్రవరి 16న రిలీజ్ అయింది ఇందులో కూడా ప్రియమణి మెయిన్ రోల్ చేసింది.
అభిమన్యు దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమా తర్వాత భామాకలాపం 3 కూడా తీస్తున్నట్లు హింట్ ఇచ్చారు.
దీనివల్ల ఇది ఒక మూవీ సిరీస్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. """/" /
సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే అందులో బూతులు, అడల్ట్ సీన్లు, వెకిలి చేష్టలు, రోత సీన్లు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ భామాకలాపం పార్ట్ 1 & 2 సినిమాల్లో ఒక్క అసభ్య పదం కూడా వాడలేదు.
అశ్లీలత ఎక్కడా కనిపించలేదు.కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు.
ఈ సినిమాలు రెండు పెద్దగా బోర్ కూడా కొట్టించవు.వీకెండ్ లో వీటిని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.
కామెడీ, మర్డర్ల మిస్టరీ, థ్రిల్లింగ్ దొంగతనాలతో ఈ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.
"""/" /
మూవీ ఫస్ట్ పార్ట్ డార్క్ కామెడీ జానర్‌లో రాగా.సెకండ్ పార్ట్ హీస్ట్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చింది.
రెండు సినిమాల్లోనూ ప్రియమణి ( Priayamani )అద్భుతంగా నటించి వావ్ అనిపించింది.
శరణ్య ప్రదీప్( Saranya ) నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది.వారిద్దరి ఆకట్టుకునే నటనా ప్రదర్శన వల్లే ఈ రెండు సినిమాలు జనాలను మొబైల్, టీవీ స్క్రీన్ లకు కట్టిపడే సాయి.
"""/" /
ఈ సినిమాలో హీరోయిజం ఎక్కడా కనిపించదు, కథే ఇందులోని అసలైన హీరో.
ఏ పాత్రకి ఇందులో ప్రాధాన్యత ఉండదు, కథ ప్రకారం మూవీ నడుస్తూ వెళ్తుంది.
ఒక కొత్త మూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ రెండు సినిమాలు ఉత్తమంగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు.
వెబ్ మూవీలు, సిరీస్ లు ఎలా తీయాలో చెప్పడానికి ఈ రెండు సినిమాలు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.