టీనేజ్ లో వేధించే మొటిమలకు ఈ పవర్ ఫుల్ రెమెడీతో చెక్ పెట్టండి!

టీనేజ్ లో యువతీ, యువకులను ప్రధానంగా వేధించే సమస్య మొటిమలు.హార్మోన్ చేంజ్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం చర్మ సంరక్షణ లేకపోవడం తదితర అంశాలు మొటిమలకు కారణాలుగా మారుతుంటాయి.

ఏదేమైనా మొటిమలు చర్మ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.అదే సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

ఈ క్రమంలోనే మొటిమలను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా టీనేజ్ లో వేధించే మొటిమలకు చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ హోమ్ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి ఏదైనా బ్రష్ తో అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలు చాలా త్వరగా త‌గ్గు ముఖం పడతాయి.

"""/"/ అలాగే మొటిమలు తాలూకు మచ్చలు సైతం దూరం అవుతాయి.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై పేరుకు పోయిన మురుకి, మృణ‌క‌ణాలు తొలగిపోతాయి.

చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారుతుంది.పైగా అధిక జిడ్డు సమస్యతో బాధపడే వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.

అధిక జిడ్డును తొల‌గించి చర్మాన్ని ఫ్రెష్ గా మార్చడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!