రాష్ట్రపతి ఎన్నికలు : బాబు బాధ అంతా ఇంతా కాదా ?

రాష్ట్రపతి ఎన్నికలు : బాబు బాధ అంతా ఇంతా కాదా ?

ఓడలు బళ్ళు.బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కి బాగా తెలిసొచ్చినట్టు గా కనిపిస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికలు : బాబు బాధ అంతా ఇంతా కాదా ?

పార్టీ ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి తన ప్రాధాన్యం తగ్గిపోవడం,గతంలో తనకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఇప్పుడు దక్కకపోవడంపై బాబు ఆవేదనతో ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు : బాబు బాధ అంతా ఇంతా కాదా ?

టిడిపి అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా అందరి ద్రుష్టి తన వైపు ఉండేలా బాబు ప్లాన్ చేసుకునేవారు .

జాతీయస్థాయిలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే వారు.అయితే టిడిపి ఓటమి చెందిన తర్వాత తనకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం పై బాబు అసంతృప్తితో ఉన్నారట.

ఇది ఇలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు వెలువడనుంది.ఇప్పుడు వైసీపీ ఈ ఎన్నికల్లో కీలకం కావడం, వైసీపీ మద్దతు తెలిపిన వారికే రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉండడంతో బిజెపి జగన్ కు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తోంది.

తాము సూచించిన వ్యక్తినే రాష్ట్రపతి గెలిపించే విధంగా ఒత్తిడి చేస్తోంది.మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ద్వారా తాము ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ అధికార పార్టీ వైసీపీ కి 23 ఎంపీ స్థానాలు ,151 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో, ఈ స్థాయిలు జగన్ కు ప్రాధాన్యం దక్కుతోంది.

కానీ తెలుగుదేశం కేవలం 23 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలకే పరిమితం అయింది.

దీంతో టిడిపి, చంద్రబాబును పట్టించుకునే వారు లేకపోవడం బాబుకు ఆవేదన కలిగిస్తోంది. """/"/ గతంలో రాష్ట్రపతి, ప్రధాని ని చేసినట్టుగా చెప్పుకున్న బాబు కు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో తన అవసరం లేకుండా పోయిందనే బాధ ఎక్కువగా ఉందట.

గతంలో చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ స్థాయి నాయకులు ఇప్పుడు పట్టించుకోకపోవడం , జగన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, ఇవన్నీ మంట పుట్టిస్తున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికలపై ఢిల్లీలో నిర్వహించే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబుకు ఆహ్వానం పంపలేదు.

కనీసం బీజేపీ నుంచి ఎటువంటి కబురు రాకపోవడం, తనను సంప్రదించకుండానే ఈ తతంగమంతా జరుగుతూ ఉండడంతో బాబు తీవ్ర ఆవేదన చెందుతున్నారట.

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..