అయ్యో పెద్దాయన.. మరోసారి తూలిపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వీడియో వైరల్

వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న అమెరికా అధ్యక్షుడు జో జైడెన్( Joe Biden ).

మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు .అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం చెప్పలేక తడబడ్డారు.

తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా - ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.

బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.ఇక గతేడాది హెలికాఫ్టర్ ( Helicopter )దిగి వస్తూ సూట్ జాకెట్ వేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారు.

కానీ దానిని వేసుకోవడానికి ఆపసోపాలు పడ్డారు.చివరికి భార్య జిల్ బైడెన్ సాయం చేయడంతో కోటును తొడుక్కోగలిగారు.

సరిగ్గా ఇదే సమయంలో తాను ధరించిన కళ్లజోడు కిందపడటంతో మళ్లీ దానిని తీసుకునేందుకు వంగాల్సి వచ్చింది.

ఆ తర్వాత చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చక్ షుమెర్ అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

బైడెన్‌కి కూడా ఇచ్చి, పక్కకు జరిగారు.సరిగ్గా ఇదే సమయంలో బైడెన్ మతిమరుపు బయటపడింది.

అప్పటికే తనకు షుమెర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మరిచిపోయిన పెద్దాయన.మరోసారి కరచాలనం కోసం చేయి ఇచ్చారు.

అప్పట్లో ఈ ఘటన వైరల్ అయ్యింది. """/" / ఈ ఏడాది మార్చిలో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా.

బ్యాంకు సంక్షోభం, వినియోగదారుల రక్షణ, ఆర్ధిక వ్యవస్థకు ఏం చేయబోతున్నారంటూ విలేకరులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

వీటికి ఉక్కిరిబిక్కిరైన బైడెన్ తడబడ్డారు.వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేదిక దిగి బయటకు నడవటం ప్రారంభించారు.

కనీసం వెనక్కి కూడా తిరగకుండా సమావేశ మందిరం తలుపులు మూసి బయటకు వెళ్లిపోయారు.

తాజాగా పెద్దాయన మరోసారి నవ్వుల పాలయ్యారు.గురువారం కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగిన అమెరికా వైమానిక దళ అకాడమీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో( US Air Force Academy Graduation Day Celebrations ) ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేదికపై నిల్చొన్న ఆయన.పక్కకు జరుగుతూ, ఒక్కసారిగా తూలిపడిపోయారు.

వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది బైడెన్‌ను పైకి లేపారు.తన కాళ్లకు ఏదో అడ్డు తగిలిందని.

వేదికపై వున్న వస్తువును ఆయన చూపించారు .ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / కాగా.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడైన వ్యక్తిగా జో బైడెన్ రికార్డుల్లోకెక్కారు.

ఇప్పటికే ఆయన వయసు 80 ఏళ్లు కాగా.మరోసారి అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్నారు.

దీంతో ప్రతిపక్ష రిపబ్లికన్లు బైడెన్ వయస్సుపై కామెంట్స్ చేస్తున్నారు.ఒకవేళ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచినా బైడెన్ పూర్తికాలం పదవిలో వుండరంటూ వారు సెటైర్లు వేస్తున్నారు .

అయితే అధ్యక్షుడు శారీరకంగా దృఢంగా వున్నారని.క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారని వైట్‌హౌస్ వైద్యులు తెలిపారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!