హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!

మరికొద్దిరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) శనివారం రాజకీయాలు, క్రీడలు, వినోదం, పౌర హక్కులు, ఎల్‌జీబీటీక్యూ న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రంలో సేవలందించిన పలువురు ప్రముఖులకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను( Presidential Medal Of Freedom ) ప్రదానం చేశారు.

వైట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు( Hillary Clinton ) ఈ పతకాన్ని ప్రదానం చేశారు బైడెన్.

ఈ కార్యక్రమానికి హిల్లరీ క్లింటన్ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కుమార్తె చెల్లియా క్లింటన్, మనవరాళ్లు హాజరయ్యారు.

"""/" / అలాగే డెమొక్రాటిక్ పార్టీకి చెందినే జార్జ్ సోరస్, నటుడు - దర్శకుడు డెంజెల్ వాషింగ్టన్‌, చెఫ్ జోస్ ఆండ్రేస్ , బోనో, జాన్ గూడాల్, అన్నా వింటౌర్, రాల్ఫ్ లారెన్, జార్జ్ స్టీవెన్స్ జూనియర్, టిమ్ గిల్, డేవిడ్ రూబెన్ స్టెయిన్‌లకు కూడా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం లభించింది.

ఇక మరణానంతరం నలుగురు ప్రముఖులకు ఈ అవార్డ్ ప్రకటించారు బైడెన్.మిచిగన్ గవర్నర్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ రోమ్నీ.

మాజీ అటార్రనీ జనరల్ , సెనేటర్‌గా సేవలందించిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ,( Robert F Kennedy ) మాజీ రక్షణ కార్యదర్శి యాష్ కార్టర్.

మిస్సిస్సిప్పి ఫ్రీడమ్ డెమొక్రాటిక్ పార్టీ వ్యవస్ధాపకులు , 1965 ఓటింగ్ హక్కుల చట్టానికి పునాదులు వేసిన ఫెన్నీ లౌ హామర్‌లకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు బైడెన్.

"""/" / అధ్యక్షుడిగా మరో 15 రోజుల్లో జో బైడెన్ దిగిపోనున్నారు.ఈ నేపథ్యంలో సైనికులు, మాజీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అవార్డులు, పతకాలు జారీ చేస్తూ కాలం గడిపేస్తున్నారు.

కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్( Congressional Research Service ) ప్రకారం.ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం‌ను 1963 నుంచి 2024 మధ్య 654 మందికి ప్రదానం చేశారు.

ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న వారిలో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మాయా ఏంజెలో, మదర్ థెరిస్సా వంటి మహనీయులు ఉన్నారు.

అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?