విజయవాడ కనకదుర్గమ్మ కు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా నేడు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య పసుపు కుంకుమలు కూడా అందజేశారు.అంతకుముందు దుర్గ గుడిలో సీఎం జగన్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!