మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధం : రష్యా
TeluguStop.com
ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై పలు దేశాలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు రష్యా ఈ నెల 12వ తేదీన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో రష్యా అడ్వాన్స్ డ్ ట్రయల్స్ (మూడో దశ ప్రయోగం) నిర్వహించడానికి సిద్ధమైంది.
పూర్తిస్థాయిలో ప్రయోగాలు నిర్వహించకుండా హడావుడిగా రష్యా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.
అతి కొద్ది మందిపై కేవలం రెండు దశల్లో ప్రయోగాలు చేపట్టింది.ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా సమాచారం అందించకపోవడంతో పలు దేశాల్లో సందేహాలు పుట్టుకొచ్చాయి.
వైరస్ ను సమర్థవంతంగా నిర్మూలించలేదనే వాదలు ఎక్కువ అవడంతో రష్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.‘స్పుత్నిక్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగం చేయనుంది.
అయితే ఈ మూడోదశ ప్రయోగంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
దీంతో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి వివరాలను వెల్లడించింది.వచ్చే వారమే మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది.
తొలిసారి నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆ రోల్ లో కనిపిస్తారా?