లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాం..: సీఈవో వికాస్ రాజ్
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj )) తెలిపారు.
ఈ తరహాలోనే లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.ఫిబ్రవరి 8న తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.దాదాపు తొమ్మిది లక్షల మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
"""/"/ హైదరాబాద్ లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే( National Voters Day ) సందర్భంగా వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్( Governor Tamilisai Soundararajan ) తో పాటు సీఈవో వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి తదితరులు హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?