ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం..: మంత్రి కారుమూరి

ఏపీలో రాగుల పంటను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు.

రేషన్ లో గోధుమపిండి వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు.ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని చెప్పారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న ఆయన పురంధేశ్వరి నియామకంతో వైసీపీకి మేలే జరుగుతుందని వెల్లడించారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన అని స్పష్టం చేశారు.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌