బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
TeluguStop.com
చిలకలూరిపేట ,విను కొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని నా పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
శనివారం ఆయన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో "బి" టాక్స్ పేరుతోటి విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ టెక్స్టైల్ పార్క్ కి నేను డబ్బులు అడిగానని, తిరుమల డైరీ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బంది పెట్టారని చెప్పుతున్నారూ.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కారుచౌకగా భూములు కొని సబ్సిడీ పొంది, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్కు అమ్మమని నా దగ్గరకు వచ్చి నా పై చంద్రబాబు పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నాలుగైదు పార్టీలు మారిన బొల్లా బ్రహ్మనాయుడు నిబద్ధత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉన్నాయని, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం మాట్లాడుతున్నారని, నిబద్ధత లేని నాయకుడని అన్నారు.
తిరుమల డైరీ ని సుమారు 16,నుంచి18 ఓట్లకు అమ్ముకున్నారని, మీ ప్రభుత్వంలో 700 వందల కోట్లు టెక్స్టైల్ పేరిట కేటాయించారు.
ఆ నిధులు ఏమయ్యాయి.టెక్స్టైల్ పార్కు యందుకు పెట్టలేకపోయారు.
అలాగే మీ అవినీతి పైన చర్చకు సిద్ధమని ప్రత్తిపాటి సవాల్ విసిరారు.ఎక్కడికి రమ్మన్నా.
వస్తాను మీరు మీడియా సాక్షిగా చర్చకు రావాలని హెచ్చరించారు.
విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?