అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం.. మంత్రి ఆదిమూలపు
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబుకు ప్రజల ప్రయోజనం పట్టదన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు.గతంలో దళితులను అవమానిస్తూ టీడీపీ నేతలు మాట్లాడారని మంత్రి ఆదిమూలపు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులను టీడీపీ అసహ్యించుకుంటే జగనన్న అక్కున చేర్చుకున్నారని తెలిపారు.పదవుల్లో వారికి సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
దళితులు ఎవరూ టీడీపీని నమ్మొద్దన్న ఆయన ఎస్సీలకు తాము చేకూర్చిన లబ్దిపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
రష్మిక అబార్షన్ చేయించుకుందా….బాంబ్ పేల్చిన నటుడు…ఆయనే కారణమా?