క్రైస్తవ ఆస్తులపై చర్చకు సిద్ధం..: మంత్రి మేరుగ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు.ఏడు వేల కోట్ల క్రైస్తవ ఆస్తులను కాజేస్తున్నామని చంద్రబాబు ఆరోపించారన్న ఆయన తమ గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని తెలిపారు.
క్రైస్తవ ఆస్తుల కోసం గతంలో వెంపర్లాడింది చంద్రబాబేనని మంత్రి మేరుగ ఆరోపించారు.ప్రస్తుతం రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో క్రైస్తవ ఆస్తులపై చర్చకు సిద్ధమన్న మంత్రి మేరుగ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ చేశారు.
చలికాలంలో చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచే న్యాచురల్ ఫేస్ ఆయిల్ మీ కోసం..!