కేంద్రం సాయంపై చర్చకు సిద్ధం.. జీవీఎస్ సవాల్
TeluguStop.com
విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.భూ కబ్జాదారులకు సీఎం జగన్ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.
భూ కుంభకోణంపై సిట్ వేసి బయట పెట్టలేదని జీవీఎల్ తెలిపారు.అవినీతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే వాటిపై సీబీఐ విచారణ వేయాలని కోరాలన్నారు.
కేంద్రం చేసిన సహాయంపై పుస్తకాలు పంపిస్తామన్న ఆయన చర్చకు రండి అని సవాల్ చేశారు.
కేంద్రం సాయంపై ఎప్పుడైనా తాము చర్చకు సిద్దమేనని స్పష్టం చేశారు.
ఏసీబి వలలో మరో అవినీతి ఆర్ఐ చేప