బాసర ట్రిపుల్ ఐటీ ఘటనలపై నివేదిక సిద్ధం

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు.

వరుస ఘటనలు, క్యాంపస్ లో మార్పులతో పాటు మెరుగుపడిన సౌకర్యాలపై ట్రిపుల్ ఐటీ అధికారులు నివేదికను రూపొందించారు.

ఈ మేరకు నివేదికను ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యాశాఖకు అందించనున్నారు.వరుస ఘటనల నేపథ్యంలో 48 గంటల్లో నివేదిక అందించాలని అధికారులకు గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వం అనుమతి ఇస్తే నివేదికను గవర్నర్ కు కూడా అందించనున్నారు ట్రిపుల్ ఐటీ అధికారులు.

అయితే ఇటీవలే ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?