ఇండో పసిఫిక్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారంపై క్వాడ్ దేశాధినేతలు చర్చించనున్నారు.ఇక అన్నింటిలోకి సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించనున్న మెగా ఈవెంట్ ఆసక్తికరంగా మారింది.
నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం( Nassau Veterans Memorial Coliseum ) వేదికగా జరగనున్న ‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్ ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.
ఈ ఈవెంట్‌ను ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ (ఐఏసీయూ) నిర్వహిస్తోంది.దాదాపు 14 వేల మంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా.
"""/" /
కళాకారులు, సెలబ్రెటీలు, అమెరికాలోని 40 రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని అంచనా.
గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ వంటి ప్రముఖులు వేదికపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
అలాగే ఈ మెగా ఈవెంట్‌లో ‘ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ ’ అనే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఏసీయూ తెలిపింది.
"""/" /
23వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరగనున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్‌లో మోడీ ప్రసంగించనున్నారు.
క్వాడ్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోడీ భేటీ అవుతారు.ఇదిలాఉండగా.
మోడీని తాను కలుస్తానంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో 2020 ఎన్నికలకు ముందు టెక్సాస్‌లోని హ్యూస్టన్ ఎన్ఆర్జీ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘హౌడీ మోడీ ’ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో కలిసి డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి అమెరికా ఎన్నికలకు ముందు మోడీ అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇడ్లీ, దోసె బదులు బ్రేక్ ఫాస్ట్ లో ఇది తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!