Vijayakanth : విజయ్ కాంత్ ది హత్య.. ఆ ప్రముఖులది కూడా హత్యే.. ప్రేమమ్ దర్శకుడు లేఖ రాయడంతో?

తమిళ దిగ్గజ నటుడు విజయ్‌కాంత్( Vijaykanth ) మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

దక్షిణాది ప్రజలు, ప్రేక్షకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

కాగా ఆయనను కడసారి దర్శించుకొనేందుకు అభిమానుల, డీఎండీకే కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.

ఇలాంటి విషాద సమయంలో మలయాళ డైరెక్టర్, ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్సే పుత్రేన్( Alphonse Putren ) సంచలన వ్యాఖ్యలు చేయడం దక్షిణాది మీడియాలో సంచలనంగా మారింది.

ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో.ఈ లేఖ ఉదయనిధి మారన్ కోసం.

"""/" / నేను కేరళ నుంచి వచ్చి రెడ్ జెయింట్ ఆఫీస్‌లో ( Red Giant Office )కూర్చొన్న సమయంలో మీరు రాజకీయాల్లోకి రావాలని రిక్వెస్ట్ చేశాను.

దివంగత కరుణానిధి ఎవరు హత్య చేశారు.ఉక్కు మహిళ జయలలితను ఎవరు మర్డర్ చేశారనే విషయాన్ని బయటపెట్టాలని కోరాను.

ఇప్పుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌ను ఎవరు హత్య చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అని తన పోస్టులో పేర్కొన్నారు.

కరుణానిధి, జయలలిత, విజయ్‌కాంత్‌( Karunanidhi, Jayalalitha, Vijaykanth ) మరణాల వెనుక హంతకులు ఎవరనేది కనుక్కోలేకపోతే ఆ కిల్లర్స్ తదుపరి టార్గెట్ స్టాలిన్ సార్.

కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలి.లేకపోతే భారీ ముప్పు మీ ముందు ఉండే ప్రమాదం ఉంది అని ఆల్ఫోన్స్ పుత్రేన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

"""/" / ఇప్పటికే స్టాలిన్‌ను( Stalin ) చంపడానికి ప్రయత్నం జరిగింది.అలాగే కమల్ హాసన్ సార్‌ను ఇండియన్ 2 షూటింగులో హత్యకు కుట్ర పన్నారు.

ఇలాంటి విషయాలను చూసి చూడనట్టు వదులొద్దు.ఇలాంటి పట్టించుకోకుండా ఉంటే పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే అని ప్రేమమ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేరం మూవీ హిట్ అయిన సమయంలో నాకు మీరు మంచి బహుమతి ఇచ్చారనే విషయం నాకు ఇంకా గుర్తున్నది.

ఐఫోన్ సెంటర్‌కు కాల్ చేసి.కేవలం 15 నిమిషాల్లోనే బ్లాక్ కలర్ ఐఫోన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఉదయ్‌నిధి అన్న ఆ విషయం మీకు ఇంకా గుర్తు ఉండే ఉంటుంది.ఆ ముగ్గురి మరణాల వెనుక హంతకులు ఎవరు? ఆ హత్యలకు ఎవరి ప్రేరణ ఉందనే విషయం తెలుసుకోవడం ఐఫోన్ గిఫ్టుగా ఇచ్చిన దాని కంటే చాలా సులభం అని ఆల్ఫోన్స్ పుత్రేన్ తన పోస్టులో పేర్కొన్నారు.

అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?