గర్భం ధరించే ఆడవారు.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
TeluguStop.com
కొంతమంది ఆడవారికి ఈ మధ్యకాలంలో పిల్లలు కలిగే అవకాశం ఉండడం లేదు.ఇలాంటివారు ఐవీఎఫ్ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు.
ఇక సాధారణంగా పిల్లల్ని అనే అవకాశం ఉన్నవారు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు.
వీరంతా తల్లిదండ్రులు కావడానికి ఏ రకంగా ప్లాన్ చేసుకున్న కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
ముఖ్యంగా ఐవిఎఫ్ పద్ధతిలో చికిత్స పొందుతున్నప్పుడు మాత్రం కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా తినకపోవడమే మంచిది.
శాఖాహారం, గ్లూటెన్ లేని ఆహారాన్ని తినడం ఎంతో మంచిది.బిడ్డకు ప్లాన్ చేసుకున్న వారు ఎవరైనా కూడా గర్భం ధరించే వరకు కచ్చితంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఎందుకంటే ఆ ఆహారాలు మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.వీర్యకణాల చలన శిలతను తగ్గిస్తాయి.
దీనివల్ల అవి అండాన్ని చేరే వేగం తగ్గిపోతుంది.కాబట్టి మీరు తినే ఆహారంలో కొన్నిటిని పక్కన పెట్టడం ద్వారా గర్భధారణను త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
"""/"/
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడమే మంచిది.వీటిలో ఒక రకమైన రసాయన పదార్థాలను కలుపుతూ ఉంటారు.
కాబట్టి వీటిని అస్సలు తినకూడదు.ప్రాసెస్ చేసిన మాంసాలు పూర్తిగా మానేయడం మంచిది.
వీటిలో హార్మోన్ అవశేషాలు మిగిలి ఉంటాయి.ఇవి గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఐవీఎఫ్ చికిత్సకు ఇవి ఆటంకం కలిగిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే కాఫీలు అధికంగా తాగే అలవాటు ఉన్నవారు మానేయడం మంచిది.
"""/"/
ఆల్కహాల్ పూర్తిగా పక్కన పెట్టాలి.ఈ రెండు కూడా పిండం పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి.
జింక్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా ఆల్కహాల్ తాగడం వల్ల మూత్రంతో పాటు బయటకు పోతాయి.
దీంతో ఆ రెండిటి లోపం శరీరంలో ఏర్పడుతుంది.దీనివల్ల గర్భం ధరించడం కష్టం కావచ్చు.
కాబట్టి ఈ రెండిటికీ దూరంగా ఉండడం ఉండటమే మంచిది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. వైరల్ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే!