గర్భిణీలు వేయించుకోవాల్సిన ముఖ్యమైన టీకాలు ఇవే..!

ప్రెగ్నెన్సీ ( Pregnancy ) సమయంలో ఆడవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా రోగ నిరోధక శక్తి ( Immunity Power ) కూడా బలహీనపడుతుంది.

దీనివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా ఉంది.గర్భధారణ సమయంలో అధిక బిపి, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

అయితే టీకాలు ( Vaccine ) సకాలంలో వేస్తే వ్యాధులను సులభంగా నివారించవచ్చు.

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ రక్షణ లభిస్తుంది.పుట్టిన తర్వాత పిల్లల్లో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ప్రతి గర్భిణీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన మూడో టీకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారికి వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది కాకుండా ఫ్లూ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి.

ఈ టీకాను గర్భధారణ సమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు.టీకా తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ కూడా ఇన్ఫ్లుఎంజా నుంచి రక్షణ పొందుతుంది.

ముఖ్యంగా చెప్పానంటే గర్భధారణ సమయంలో టెటానస్ టీటీ-1 టీకా వేయాలి.ఈ వ్యాక్సిన్ ను ప్రారంభంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు.

నాలుగు నుంచి ఐదు వారాల విరామం తర్వాత టీటీ 2 వాక్సిన్లు పొందాలి.

ఈ వ్యాక్సిన్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. """/" / హెపటైటిస్-బి వ్యాక్సిన్ కాలేయ వ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

వైద్యుల సలహా మేరకు ఈ టీకా వేసుకోవాలి.ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు రక్షణ లభిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ మహిళలు వైద్యుల సలహా తర్వాత మాత్రమే ఏదైనా టీకాను తీసుకోవాలి.

ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, శరీరంలో నొప్పి ఏదైనా ఇతర దుష్ప్రభావాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

రేవంత్ రెడ్డి దూకుడుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ … ఇక ఆపేదెవరు