గర్భం వస్తుంది కానీ బిడ్డ ఎదగదు.. బిడ్డ స్థానంలో ముత్యాలు..?!
TeluguStop.com
మాతృత్వం అనేది స్త్రీ కి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనే చెప్పాలి.
పెళ్లి అయిన ప్రతి స్త్రీ కూడా ఎప్పుడెప్పుడు గర్భం వస్తుందా, బిడ్డకు ఎప్పుడు జన్మనిస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు నెలసరి రాకపోయినా, వాంతులు విపరీతంగా అయ్యి, పొట్ట పైకి కనిపిస్తున్న గర్భం వచ్చిందేమో అని అనుకుంటారు.
అయితే పైన చెప్పిన లక్షణాలు అన్ని గర్భం వచ్చిందని చెప్పే ప్రధాన సంకేతాలే.
కానీ నిజానికి ఒక్కోసారి లక్షణాలు ఉన్నగాని కడుపులో పిండం అనేది పెరగదు.దానినే వైద్య పరిభాషలో ముత్యాల గర్భం అని పొలార్ ప్రెగ్నెన్సీ అని అంటారు.
అయితే ఇలాంటి ప్రెగ్నన్సీ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కానీ ఈ ముత్యాల గర్భం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి.
సాధారణంగా ఆరోగ్యమైన పిండం ఏర్పడడానికి మగవాళ్ల స్పెర్మ్ , ఆడవాళ్ళ అండంతో సంయోగం చెందుతుంది.
అలా తండ్రి నుంచి ఒక జత, తల్లి నుంచి మరో జత క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి.
కానీ ఈ ముత్యాల గర్భమనేది ఒక అసాధారణమైన గర్భం.ఒక విధంగా చూస్తే స్కాన్‌లో గర్బం ఉంటుంది కానీ అక్కడ బిడ్డ మాత్రం ఉండదు.
అసలు ఈ ముత్యాల గర్భం ఎలా ఏర్పడుతుంది అంటే ఆరోగ్యకరంగా ఉన్న ఒక శుక్రకణం, క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో సంయోగం చెందినప్పుడు గాని, లేదంటే రెండు శుక్రకణాలు కలిసి ఒక ఖాళీ అండంతో కలవడం వల్ల ఏర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి.
అండం లేకపోవడంతో అక్కడ అండం యొక్క క్రోమోజోములుండవు.ఇలాంటి పరిస్థితులలో ముత్యాల గర్భం అనిది ఏర్పడుతుంది.
ముత్యాల గర్భం ఏర్పడితే కడుపులో పిండం బిడ్డలా పెరగకుండా ముత్యాల వంటి బుడగల ఆకారంలో వృద్ధి చెందుతుంది.
మరి ముత్యాల గర్భం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోండి.ఆడవాళ్ళ కడుపు బాగా పైకి పెరుగుతుంది.
అలాగే విపరీతంగా వాంతులు కూడా అవుతాయి.ప్రెగ్నన్సీ హార్మోన్స్ అయిన Beta- HCG లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది.
అప్పుడప్పుడు రక్త స్రావం కూడా అవుతుంది.అలాగే అది బిడ్డ కాదు.
ముత్యాల గర్భం అని పూర్తిగా నిర్దారణ చేసుకోవాలంటే ఆ ముత్యాల వంటి కణాలను బయాప్సీ పరీక్ష చేయాల్సి ఉంటుంది.
ఈ ముత్యాల గర్భాన్ని తీసివేయాడానికి ఎలాంటి కోత, కుట్లు అవసరం లేదు.మత్తు ఇచ్చి గర్భాశయ ద్వారం నుంచి సక్షన్ ట్యూబ్ ద్వారా ముత్యాల వంటి కణ జాలాన్ని తీసివేస్తారు.
ముత్యాల గర్భం పోవడానికి అబార్షన్ చేయడానికి వాడే మందులు వాడకూడదు.అవి వాడితే గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి.
వాటివలన ఈ ముత్యాల గర్భం యొక్క కణజాలం రక్తనాళాలలో ప్రవేశించి, వేరే అవయవాలకు వ్యాప్తి చెందే అవకాశం వుంది.
అలాగే ఒక సారి ముత్యాల గర్భం వచ్చి, చికిత్స తీసుకున్న తర్వాత మరల గర్బాసాయ హార్మోన్ స్థాయి పడిపోయే వరకూ గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!