చలికాలంలో వచ్చిన దగ్గు అస్సలు తగ్గడం లేదా..? అయితే ఈ జాగ్రత్తలు వహించండి..!

ప్రస్తుతం చలికాలం( Winter ) కొనసాగుతూ ఉండడంతో ఈ కాలంలో ఉష్ణోగ్రతల మార్పులు చల్లని గాలులతో సీజనల్ ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది.

అయితే చలికాలంలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది.

దీనికి తోడు శీతల గాలులు, ఇన్ఫెక్షన్లతో చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు.

అయితే ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఈ సమస్య తీవ్రంగా మారకముందే చికిత్స తీసుకోవాలి.

అలాగే తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలు దగ్గు( Cough ) లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

"""/" / కాబట్టి సమస్య ఉన్నప్పుడు వీటిని దూరంగా పెట్టాలి.అలాగే ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గాలు అలాగే చేయకూడని తప్పులు కూడా కొన్ని ఉన్నాయి.

అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.అనారోగ్యంగా ఉన్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.

డిహైడ్రేషన్( Dehydration ) దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది.కాబట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ లాంటివి తాగాలి.

పాలు, చీజ్ ఇతర పాల ఉత్పత్తులు( Milk Products ) కఫం ఉత్పత్తి చేస్తాయి.

ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ జలుబు, దగ్గును మరింత ఎక్కువగా చేస్తాయి.అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.

సిట్రస్ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. """/" / అయితే నారింజ, ద్రాక్ష పండ్లు వంటి సిట్రస్ పండ్లు( Citrus Fruits ) తినడం వలన ఎక్కువగా గొంతు నొప్పికి చికాకు కలిగిస్తాయి.

కాబట్టి చలికాలంలో దగ్గుతో బాధపడుతున్నప్పుడు అరటి పండ్లు, పుచ్చకాయలు లాంటి తేలికపాటి పండ్లను తినడం మంచిది.

అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్ ను దూరంగా పెట్టడం మంచిది.ఇవి రికవరీకీ అడ్డుపడతాయి.

కాబట్టి తాజా పండ్లు, తాజా కూరగాయలు మాత్రమే తినాలి.టీ కాఫీ ని కూడా అతిగా తాగడం వలన హాని కలుగుతుంది.

ఎందుకంటే ఇందులో అధిక కేఫిన్ ఉంటుంది.అధిక కేఫిన్ శరీరానికి హాని కలిగిస్తుంది.

నెల రోజులలో 9 కోట్ల సాయం.. మెగా మంచి మనసుకు ఫిదా అవ్వాల్సిందే!