నాన్న బస్ డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే మాత్రం వావ్ అనాల్సిందే!

మన దేశంలోని అత్యంత కఠిన పరీక్షలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష( UPSC ) కూడా ఒకటి.

ఈ పరీక్షలలో సత్తా చాటాలని చాలామంది భావిస్తారు.లక్షల మంది పరీక్ష రాస్తే వందల సంఖ్యలో అభ్యర్థులు మాత్రమే ర్యాంకులు సాధిస్తారు.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆలిండియా స్థాయిలో మంచి ర్యాంక్ ను సాధించిన వాళ్లలో ప్రీతి హుడా( Preeti Hooda ) కూడా ఒకరు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రీతి హుడా కష్టపడి లక్ష్యాన్ని సాధించారు.బాల్యం నుంచి ప్రీతి చదువులో చురుకుగా ఉండేవారు.

పదో తరగతిలో 77 శాతం మార్కులు సాధించిన ప్రీతి ఇంటర్ లో 87 శాతం మార్కులు సాధించారు.

ఇంటర్ తర్వాత చదువు మానేసి పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరగా ప్రీతి మాత్రం చదువును కొనసాగించడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు.

ఢిల్లీలోని లక్ష్మీభాయి కాలేజ్ లో ప్రవేశం పొంది హిందీలో పట్టభద్రురాలైన ప్రీతి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ( PhD ) చేశారు.

"""/" / హర్యాణా రాష్ట్రంలోని( Haryana ) బహదూర్ఘగ్ ప్రాంతానికి చెందిన ప్రీతి ఎంతో కష్టపడి యూపీఎస్సీ పరీక్షలో 288వ ర్యాంక్ సాధించారు.

ప్రీతి తండ్రి ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో బస్ డ్రైవర్ గా( Bus Driver ) పని చేస్తుండటం గమనార్హం.

ఎంతో కష్టపడి ప్రీతి యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు.సివిల్స్ లో ప్రీతి హిందీ మీడియంను ఎంచుకున్నారు.

హిందీ సబ్జెక్ట్ ను ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఆమె ఎంచుకోవడం గమనార్హం. """/" / తొలి ప్రయత్నంలో ప్రీతి హుడాకు ఆశించిన ఫలితాలు రాలేదు.

రెండో ప్రయత్నంలో ప్రీతి హుడా తన లక్ష్యాన్ని సాధించారు.ప్రీతి హుడా చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొని సక్సెస్ సాధించడం గమనార్హం.

ప్రీతి హుడా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ప్రీతి హుడాను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

బృందావనం సినిమాలో శ్రీహరి పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను తీసుకోవాలనుకున్నారా .?