Preeta Vijay Kumar : సినిమా ఆఫర్లు లేకపోయినా సులువుగా రూ.కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. ఎలా అంటే?
TeluguStop.com
కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్( Preeta Vijay Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈమె నటుడు విజయ్ కుమార్ కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.సినీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రీతా విజయ్ కుమార్ తెలుగు మలయాళం భాషల్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొదట 1998లో రుక్మిణి( Rukmini ) అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు.
ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు.
"""/" /
ఇక హీరోయిన్ గా బాగా నటిస్తున్న సమయంలో ఈమె దర్శకుడు హరిని( Director Harini ) పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి సంసార జీవితంలో సెటిల్ అయిపోయింది.
కాగా హరి ప్రీత దంపతులకు ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు.కాగా ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ప్రీతా విజయ్ కుమార్ సోదరీ హీరోయిన్ శ్రీదేవి ( Heroine Sridevi )అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
తన అక్క తో కలిసి దిగిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రీతా విజయ్ కుమార్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిమిటంటే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ప్రీతా విజయ్ కుమార్ బిజినెస్ రంగంలో బాగా రాణించడంతో పాటు లక్షలు సంపాదిస్తోందట.
ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు.
దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్( Metro Coffee House ) ఏర్పాటు చేశారు.
ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం.మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది.
వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు.ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
మరోవైపు ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా బాగానే సంపాదిస్తున్నారు.
ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?