చెరుకు పంట కోతలలో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

రైతులు పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ జాగ్రత్తగా పంటను కాపాడుకుంటేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే వీలుంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural Experts ) చెబుతున్నారు.

కొంతమంది చెరుకు రైతులు చెరుకు పంట పక్వానికి రాకముందే క్రషింగ్ కు తరలిస్తుంటారు.

దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

చెరుకు పంట కోతల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.చెరుకు పంట( Sugarcane Crop ) పక్వానికి వస్తే ఆకులు ఆకుపచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారతాయి.

చెరుకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి.చెరుకు గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడతాయి.

చేతి రిఫ్రాక్టోమీటర్( Refractometer ) ద్వారా చెరుకు పంట పక్వానికి వచ్చిందో లేదో కూడా తెలుసుకోవచ్చు.

"""/" / చీడపీడలు ( Pests )ఆశించిన చెరుకు గడలను వేరుగా క్రషింగ్ లేదంటే బెల్లం తయారీకి పంపాలి.

ఆలస్యం చేస్తే దిగుబడులతో పాటు రసం నాణ్యత తగ్గుతుంది.పూత వచ్చిన లేదంటే బెండు బారిన చేరుకుని నరకడం ఆలస్యం చేయరాదు.

పూత వచ్చిన చెరుకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చేరుకుని ఫ్యాక్టరీకి తరలించాలి.

చెరుకును భూ మట్టానికి నరకాలి.కొంతమంది రైతులు భూమిపై రెండు లేదా మూడు అంగుళాలు వదిలి నరుకుతున్నారు.

దీంతో ఒక ఎకరం పొలంలో సుమారుగా రెండు టన్నుల దిగుబడి తగ్గుతోంది. """/" / చెరుకు క్రషింగ్ కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లాంటివి పూర్తిగా తొలగించాలి.

నీటి ముంపునకు గురైన చెరకు తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటే కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి.

నరికిన చెరుకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి తరలించాలి.ఆలస్యం అయ్యే కొద్ది రెండు నుంచి నాలుగు శాతం వరకు రసం నాణ్యత తగ్గుతుంది.

చెరుకులు నరికిన వెంటనే నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పల్చగా పోయాలి.

చెరుకు పంటను సాగు చేసే రైతులు ఈ మెలకువలు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

మొండి మెటిమలనైనా మాయం చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ మీకోసం!